Breaking News

వినేశ్‌ ఫోగట్‌.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది: యోగేశ్వ‌ర్ దత్‌

Published on Tue, 09/24/2024 - 13:39

ఢిల్లీ:  స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ పోగట్‌పై ఒలింపిక్‌ మెడలిస్ట్‌ యోగేశ్వ‌ర్ దత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయటం సరికాదని విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 

‘‘ఒకవేళ నేను ఇటువంటి అనర్హత వేటు పరిస్థితిని ఎదుర్కొంటే.. తక్షణమే దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పేవాడిని. ఈ అంశాన్ని వినేశ్‌ ఫోగట్‌ ప్రజల్లో​కి తీసుకువెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురయ్యాను. ఒలింపిక్స్‌ జరిగిన అంశంపై వినేశ్‌ ఫోగట్‌ వ్యాప్తి చేసిన కుట్ర పూర్తిత విధానాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.

అదీకాక.. ఈ విషయంలో ఆమె ప్రధానమంత్రి మోదీని నిందించే స్థాయికి వెళ్లిపోయారు. ఆమె ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైతే.. జరిగిన పొరపాటుకు దేశానికి క్షమాపణలు తెలపాలి. కానీ, ఆమె  ఈ విషయంలో కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. గ్రాము కంటే ఎక్కువ బరువు  ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలుసు. కానీ ఆమె ఒలింపిక్స్‌లో ఏదో తప్పు జరిగిందని పేర్కొంది.ఫైనల్‌  వెళ్లిన సమయంలోనే ఆమె దేశం దృష్టిలో చాలా గౌరవం సంపాదించుకున్నారు’ అని అన్నారు.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడి పతకం  కోల్పోయిన వినేశ్‌ అనంతం  రాజకీయాల్లో చేరారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలో ఆమె చేరగా.. హర్యానా  అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా జులానా నియోజకవర్గంలో బరిలోకి దించిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెజ్లింగ్‌లో యోగేశ్వ‌ర్ ద‌త్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విధితమే.

చదవండి: పీటీ ఉషపై వినేశ్‌ ఫొగట్‌ సంచలన ఆరోపణలు

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు