Breaking News

Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు

Published on Mon, 12/30/2024 - 07:16

మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎ‍న్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.

హత్రాస్ తొక్కిసలాట
2024, జులై 2న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్‌(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.

ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్‌పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.

ఝాన్సీ అగ్ని ప్రమాదం
2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్‌ఐసీయూ వార్డులో 54 మంది  చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు.  ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది. 

ఇది ​కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)