Breaking News

రెజ్లర్లకు న్యాయం జరిగేనా? అమిత్ షాతో భేటీ

Published on Mon, 06/05/2023 - 10:36

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్  భూషణ్ శరణ్  సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు.    

తొందరగా విచారణ చేయించండి... 
కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్  భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ  పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం  దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ  ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు.

దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)