Breaking News

రైతుల గోడు కేంద్రం వినాలి

Published on Sun, 09/01/2024 - 05:15

చండీగఢ్‌: ఒలింపిక్‌ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్‌ ఫొగాట్‌ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్‌ పాయింట్ల వద్ద పంజాబ్‌ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్‌తోపాటు ఖనౌరీ బోర్డర్‌ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్‌ ఫొగాట్‌ మద్దతు పలికారు. 

రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది.  రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ  చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది. 

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి. 

డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు.

 నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ ఏర్పాటుచేశాయి.   
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)