Breaking News

‘కాలుస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’.. రిటైర్డ్ ఐపీఎస్‌కు బజరంగ్ పూనియా ఛాలెంజ్‌

Published on Mon, 05/29/2023 - 16:40

న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు.

‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ..  ‘‘ఈ ఐపీఎస్‌ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు.
 

చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)