Breaking News

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో దీపావళి వెలుగులు

Published on Wed, 10/30/2024 - 09:19

దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది. అమెరికాలోని అత్యంత ఎత్తైన భవనమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ లైట్లు ట్విన్‌ టవర్స్‌ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దీపోత్సవాన్ని  ఎంతో ఘనంగా జరుపుకుంటారు.  వారు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు.
 

2021లో తొలిసారిగా న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి  వేడుకలు జరిగాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. నాటి నుంచి ప్రతీయేటా దీపావళి నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అందమైన లైట్లతో అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు మత సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు