Breaking News

గిరిజన గళానికి గిన్నిస్‌ కిరీటం!

Published on Sun, 12/14/2025 - 06:12

పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత స్వప్నిల్‌ దంగ్రీకర్‌ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్‌ సొంతం చేసుకుందని ప్రకటించారు. 

బిర్సా ముండాకు అంకితం 
ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్‌ రాజేష్‌ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్‌ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. 

1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం 
ఫెర్గుసన్‌ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్‌ 12న పుణే బుక్‌ ఫెస్టివల్, యశ్వంత్రావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, రైజ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్‌ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. 

అంతరిస్తున్న భాషల పరిరక్షణ 
సామాజిక కార్యకర్త గిరీష్‌ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది.  
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)