Breaking News

సాంకేతిక మార్గదర్శకులు!

Published on Mon, 06/30/2025 - 03:22

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్‌’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్‌ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. 

ఆస్టరాయిడ్‌ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్‌ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్‌నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కితాబిచ్చింది. 

వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్‌ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం.  హైదరాబాద్‌ కంపెనీ ఈక్వల్‌ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..

అగ్నికుల్‌ కాస్మోస్‌: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్‌ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్‌’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్‌ లాంచ్‌ప్యాడ్‌ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్‌ లాంచ్‌ప్యాడ్‌. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్‌ప్యాడ్‌ ఉండేది. అగ్నిబాణ్‌ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి  ప్రయోగించారు. ‘అగ్నిలెట్‌’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్‌–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ తయారు చేసింది.

సైన్స్  ఎల్‌ఆర్‌ (సైబర్‌నెటిక్స్‌ ల్యాబొరేసైన్స్  ఎల్‌ఆర్‌ (సైబర్‌నెటిక్స్‌ ల్యాబొరేటరీ): టరీ):  బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్‌ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్‌ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్‌ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.

డెజీ: స్మైల్స్‌.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్‌ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.

దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్‌ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్‌ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్‌లో 2018లో స్థాపించారు.

ఈక్వల్‌: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్‌ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్‌ రెడ్డి, రాజీవ్‌ రంజన్‌ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.

ఎక్స్‌పోనెంట్‌ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్‌తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పూర్తి అయ్యే ఈ–పంప్స్‌ (చార్జింగ్‌ స్టేషన్‌) తయారు చేస్తోంది.

ఫ్రేట్‌ టైగర్‌: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవ­లు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్‌తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్‌ చేయడానికి డిజిటల్‌ వేదికను రూపొందించింది.

గెలాక్స్‌ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్‌. ఐదుగురు ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.

సోలార్‌స్క్వేర్‌: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్‌ ప్యానెల్‌ సిస్టమ్స్‌ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్‌ సేవలను అందిస్తోంది.

ది ఈ–ప్లేన్‌ కో: ఐఐటీ మద్రాస్‌లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్‌ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్‌ ట్యాక్సీని తొలుత మానవ పైలట్‌తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్‌ ఎయిర్‌ ట్యాక్సీ రానుంది. పైలట్‌ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)