Breaking News

‘సమానత’లో భారత్‌ ఘనత 

Published on Sun, 07/06/2025 - 06:34

న్యూఢిల్లీ: 2011–12 కాలం నుంచి చూస్తే 2022–23 నాటికి భారత్‌లో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్‌ కీర్తించింది. అత్యంత పేదరికం స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్‌లో 2011–12 కాలంలో 16.2 శాతంగా ఉన్న ‘అత్యంత పేదరికం’.. 2022–23 ఏడాదికల్లా ఏకంగా 2.3 శాతానికి తగ్గిపోయింది.

 గత దశాబ్దకాలంలో భారత్‌లో చేపట్టిన పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా ఇంతటి మార్పు సాధ్యమైందని నివేదిక వ్యాఖ్యానించింది. సమానత్వం విషయంలో స్లోవాక్‌ రిపబ్లిక్‌(24.1), స్లోవేనియా(24.3), బెలారస్‌ (24.4)దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గినీ ఇండెక్స్‌ స్కోర్‌లో చైనా, అమెరికా, బ్రిటన్‌ కంటే భారత్‌ మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 

25.5 స్కోర్‌తో భారత్‌ ప్రపంచంలో నాలుగో అత్యుత్తమ సమానత్వ దేశంగా ఆవిర్భవించిందని ప్రపంచబ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణీ అవుతోందన్న దానిని పరిగణనలోకి సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్‌ స్కోర్‌ను ఇస్తారు. ఇండెక్స్‌ స్కోర్‌గా సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. 98 స్కోర్‌ వస్తే దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు కడు పేదరికంలో ఉన్నట్లు అర్థం. 

167 దేశాల స్కోర్‌లను ప్రపంచబ్యాంక్‌ ప్రకటించగా చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్‌ సాధించాయి. 25.5 స్కోర్‌తో భారత్‌ అసమానత కేటగిరీ(25–30)లో దిగువ స్థాయిలో నిలిచింది. నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్‌లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు కోరల నుంచి బయటపడ్డారు. తక్కువ అసమానతల కేటగిరీలో దాదాపు 30 దేశాలున్నాయి. ఇందులో పటిష్టమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న కొన్ని యురోపియన్‌ దేశాలు సైతం ఉన్నాయి. వీటిలో ఐస్‌ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియంలతోపాటు అభివృద్దిచెందుతున్న దేశం పోలండ్, సంపన్న దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)