Breaking News

సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం

Published on Wed, 11/27/2024 - 07:29

ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్‌రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్‌రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

లైష్‌రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్‌లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి  వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.

జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్‌ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు  అదృశ్యమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)