Breaking News

టిక్కెట్‌ లేకున్నా వెళ్లొచ్చని మోదీయే చెప్పారు!

Published on Tue, 02/18/2025 - 07:49

పట్నా: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు జన జాతర కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ మేళా సాగనుంది. ఇక ముఖ్యమైన దినాలేవీ లేనప్పటికీ జనం లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలి వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఇదే అదనుగా జనం టిక్కెట్‌ లేకుండానే రైలు ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ ఘటనే..! బిహార్‌లోని దానాపూర్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ జయంత్‌ కుమార్‌ ప్రయాణికుల రద్దీతో నెలకొన్న పరిస్థితిపై రెండు రోజుల క్రితం బక్సార్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు.

 అదే సమయంలో గ్రామీణ మహిళల బృందం ఒకటి ఆయనకు తారసపడింది. వారిని వివరాలడగ్గా కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు. టిక్కెట్లు కొన్నారా అని ప్రశ్నించగా ముక్తసరిగా లేదని బదులిచ్చారు. టిక్కెట్లు కొనకుండానే రైలు ప్రయాణం చేయవచ్చని ఎవరు చెప్పారని జయంత్‌ కుమార్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీయే అలా తమకు చెప్పారంటూ ఆ మహిళలు ఠకీమని ఇచ్చిన సమాధానంతో ఆయన షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. 

చివరికి, ‘అలాంటిదేమీ లేదు. ప్రధాని మోదీయే కాదు, ఏ అధికారి కూడా టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేయనివ్వరు. ప్రయాణం చేయాలంటే టిక్కెట్‌ కొనాల్సిందే. లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం డీఆర్‌ఎం జయంత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. పండగ సీజన్‌లప్పుడు చేసినట్లుగానే కుంభ్‌ మేళాకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, జనం రద్దీ తగ్గాల్సిన వేళ పెరుగుతుండటాన్ని తామస్సలు ఊహించలేదన్నారు. లేకుంటే, మరింతగా ఏర్పాట్లు సిద్ధం చేసి ఉండేవారమని వివరించారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌