Breaking News

మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య

Published on Thu, 07/06/2023 - 14:42

ఇంఫాల్: మణిపూర్‌లో ఆగని హింసాకాండ. పాఠశాలలు తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.     

సెలవులు వాయిదా.. 
రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని వెళ్లదీస్తోంది. ఇక పాఠశాలలు ఇదివరకే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. 

రెండో రోజునే.. 
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న పాఠశాలలు పునః ప్రారంభం కాగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి భయంతో వెనకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది.

రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ పాఠశాల ఎదుట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు. చనిపోయిన మహిళ వివరాలతోపాటు హంతకులు వివరాలు కూడా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి పోలీసు వర్గాలు.   

ఆగని హింసాకాండ.. 
ఇదిలా ఉండగా ఇదే రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు ఘర్షణకు దిగగా భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. అంతకుముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుండి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని చూశాయి అల్లరిమూకలు. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో తలెత్తిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మంది గాయాల పాలయ్యారు.     

ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)