Breaking News

Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్

Published on Wed, 04/12/2023 - 13:56

స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది.

ఈ కస్టమర్‌ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు.

ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్‌కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్‌ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్‌గా ఎందుకు మార్క్‌ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు.

ఈ మహిళ ట్వీట్‌కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్‌ప్‌లు  జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది.
చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)