Breaking News

షాకింగ్‌ ఘటన.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికెళ్లిన మహిళ

Published on Tue, 09/09/2025 - 11:27

ఫరూఖ్‌బాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత(33).. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించిన యువకుడు, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. నిషా సింగ్‌ అనే మహిళను యువకుడు దీపక్ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

తమతో మాట్లాడాలంటూ దీపక్‌, అతని స్నేహితులు ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మాట్లాడానికి నిరాకరించడంతో వారి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ మహిళకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 6న ఈ సంఘటన జరిగింది.

మృతురాలి తండ్రి బాల్రామ్ సింగ్ తన కుమార్తెను ఒక వ్యక్తి, అతని స్నేహితులు ఆగస్టు 6న సజీవ దహనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పరిస్థితి గురించి డాక్టర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తాను ఆసుపత్రికి వెళ్ళానని బాధితురాలి తండ్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

"డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ కూతురు చాలా తీవ్రంగా కాలిపోయిందని.. త్వరగా రండి అని చెప్పారు. నేను అక్కడికి చేరుకునేసరికి ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 'నాన్నా నన్ను రక్షించు' అని అరుస్తోంది. దీపక్ తనకు నిప్పు పెట్టాడని చెప్పింది. ఆ వ్యక్తి తనతో మాట్లాడమని, కలవమంటూ బలవంతం చేసేవాడని తన కూతురు చెప్పిందని తండ్రి బాల్రామ్ సింగ్ తెలిపారు. నిషా సింగ్‌ భర్త మాట్లాడుతూ.. వేధింపులు గురించి తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)