Breaking News

ఈ సీటు నాదంటూ డ్రైవరుతో గొడవ.. చివరికి

Published on Tue, 06/13/2023 - 17:09

ఒక బస్సులో జరిగిన హైడ్రామా చూస్తే ఎవ్వరికైనా పొట్ట చెక్కలైపోవాల్సిందే. ఒక బస్సులో కూర్చోవడానికి ఎక్కడా సీటులేక ఏకంగా  డ్రైవర్ సీటులోనే కూర్చుంది ఒక మహిళ. కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి లేవమన్నా లేవలేదు సరికదా కావాలంటే నువ్వే వెళ్లి ఎక్కడైనా కూర్చోమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆ మహిళతో పాటు ఆమె అత్తగారు కూడా వాదులాడటంతో వారిని ఒప్పించడం ఆ డ్రైవర్ వల్ల కాలేదు. చివరికి దౌర్జన్యం చేస్తే తప్ప డ్రైవరుకు తన సీటు దక్కలేదు.    

ఇంకెక్కడైనా కూర్చో.. 
అర్జెంటు పనిమీద ఎదో ఊరికి ప్రయాణం కట్టిన అత్తాకోడళ్లు బస్ స్టాండ్లో ఉన్న ఒక బస్సు ఎక్కారు. అత్తాకోడళ్లలో అత్తకు వెనక ఎక్కడో ఒక సీటు దొరకడంతో వెళ్లి కూర్చుంది. కానీ కోడలు మాత్రం బస్సులో ఎక్కడా సీటు లేక ఖాళీగా ఉందని నేరుగా వెళ్లి డ్రైవర్ సీటులో కూర్చుంది. తీరా బసు డ్రైవర్ వచ్చి అది నా సీటు నేను బసు డ్రైవింగ్ చేయాలి.. వెళ్లి వేరే చోట కూర్చోమని అడిగితే..  ఆ మహిళ ఇది నీ సీటు కాదు నాది, కావాలంటే నువ్వే వెళ్లి వేరెక్కడైనా కూర్చుని బస్సు నడపమని సలహా ఇచ్చింది. 

కోడలికి అత్త  వత్తాసు.. 
కొద్దిసేపటికి వెనక ఉన్న అత్త కూడా కోడలితో కలిసి డ్రైవరుని దుర్భాషలాడారు. పాపం డ్రైవరుని ఒక్కడిని చేసి అత్తాకోడళ్లు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చుట్టూ చేరిన జనం కూడా డ్రైవరుకు ఎటువంటి సాయం చేయకపోవడం విదూరం. చివరికి సహనం నశించిన డ్రైవరు ఆమెని బలవంతంగా కిందకు లాగితే గాని తన సీటు తనకు దక్కలేదు. ఎక్కడ జరిగిందో తెలియదు గాని, ఉత్తర భారతదేశంలోనే ఎక్కడో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియోని ఎవరో ఫోన్లో తీసి సోషల మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పుడు వైరల్ కావడం విశేషం.

మొదట ఇదేదో ప్రాంక్ వీడియో అనుకున్న చాలామందికి కొద్దిసేపు అత్తాకోడళ్ల మాటతీరు చూశాక గాని అర్ధం కాదు ఇది సీరియస్ మ్యాటరేనని.. వారికి బస్సు ఎలా నడుస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని. టెక్నాలజీ సాయంతో రాకెట్ వేగంతో కాలం దూసుకుపోతున్న రోజుల్లో ఇలాంటి అమాయకులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.   

ఇది కూడా చదవండి: భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్లో వెతికిన భార్య
 
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)