Breaking News

స్వీట్‌ పాప్‌కార్న్‌ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..

Published on Thu, 08/10/2023 - 12:21

ఈ రోజుల్లో హోమ్‌ డెలివరీ సర్వీస్‌ అందిస్తున్న పలు ప్రైవేట్‌ కంపెనీలు క్రియేటివ్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్‌ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది. 

పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్‌ చేసిన క్యారమెల్‌ పాప్‌కార్న్‌తో పాటు సదరు ఫుడ్‌ డెలివరీ యాప్‌ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్‌ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్‌ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్‌ చేసిన కారమెల్‌ పాప్‌కార్న్‌ ప్యాకెట్‌తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్‌షిప్‌ క్యాంపెయిన్‌గా స్విగ్గీ పేర్కొంది. 

సాహూ తన ట్విట్టర్‌ ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నోట్‌తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఆ లెటర్‌లో ఒక కవితతో పాటు ఒక లైఫ్‌ లెసన్‌ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్‌షిప్‌ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్‌ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్‌ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు.   
ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్‌ లెటర్‌!
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)