Breaking News

ఫ్రిడ్జ్‌లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!

Published on Thu, 09/11/2025 - 08:03

పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. 

ఉత్తరప్రదేశ్‌ మోరాదాబాద్‌లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్‌ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్‌లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్‌? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.

ఏమిటీ పోస్ట్‌పార్టమ్‌ సైకోసిక్‌.. 
సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం..  చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. 

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్‌ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.

మోరాదాబాద్‌ ఘటనలో మహిళకు పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. 

ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)