Breaking News

సార్‌ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!

Published on Sat, 04/12/2025 - 09:42

సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ షర్మిలను అధికారులు వెయిటింగ్‌ లిస్ట్‌కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్‌ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. 

ఇదిలా ఉండగా దినేష్‌ బంధువు ఏప్రిల్‌ 8వ తేదీన మరణించాడు. దినేష్‌ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్‌ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను మోటార్‌ సైకిల్‌ పై నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దినేష్‌ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. 

దినేష్‌ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్‌లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్‌ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

బంధువుల ఆందోళన
ఈ విషయం తెలుసుకున్న దినేష్‌ బంధువులు తంజావూరు మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్‌ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్‌స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్‌ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్‌ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)