Breaking News

యువతికి ఆకలేసింది.. స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌ పెట్టింది!

Published on Wed, 02/04/2026 - 15:02

ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది.  శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికి పోయాడు..చివరికి  ఆర్డర్‌ను డెలివర్ చేయకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్చాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక డెలివరీ బాయ్ ..ఎప్పటి లాగే.. అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్శిల్‌ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రెస్‌కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది.  కానీ అతను ముందుకు వెళ్లగా… ఆ లోకేషన్ చూసి షాక్ అయ్యాడు.

ఆ వ్యక్తి  రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి..తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ..తాను స్మశానంలో ఫ్రెండ్స్‌తో లోపల పార్టీ చేసుకుంటున్నాం” అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేసి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగినదో స్పష్టంగా తెలియడం లేదు. కొందరు ఇది ఫేక్ వీడియో అని, మరికొందరు AI ద్వారా తయారైన వీడియో అని చర్చ చేస్తున్నారు. అయినా, రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్‌లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది.

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)