Breaking News

‘సహజీవనంలో భాగస్వామిని అలా విచారించ‌లేం’

Published on Thu, 07/11/2024 - 16:51

స‌హ‌జీవనంలో భాగ‌స్వామిపై 498 కేసుకు సంబంధించి కేర‌ళ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌లో మహిళతో సహజీవనం చేసే వ్యక్తిని భర్తగా పరిగణించలేమ‌ని పేర్కొంది. మ‌హిళ‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి సెక్ష‌న్ 498 ప్ర‌కారం క్రూరత్వం కింద విచారించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ త‌న‌తో రిలేష‌న్‌లో ఉంటున్న వ్య‌క్తి క్రూర‌త్వానికి పాల్ప‌డినందుకు ఐపీసీ సెక్ష‌న్ 498A కింద కేసు పెట్ట‌లేమ‌ని హైకోర్టు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఫిర్యాదు చేసిన మహిళ‌తో రిలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తిపై  విచార‌ణ‌ను ర‌ద్దు చేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది.

కాగా 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని భర్తగా చూడలేమని చెప్పింది.

సెక్షన్ 498A కింద నేరాన్ని న‌మోదు చేయాలంటే.  భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడి ఉండాల‌ని కోర్టు సూచించింది. మ‌హిళ‌తో చ‌ట్ట‌బ‌ద్దంగా వివాహం జ‌రిగిన వ్య‌క్తిని భ‌ర్త‌గా ప‌రిగ‌ణిస్తార‌ని  తెలిపింది.  చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద విచారించ‌లేమని చెప్పింది.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)