Breaking News

పొడవు జుట్టుంటే మహిళ మృతదేహమేనా? పోస్టుమార్టంలో ఏం తేలింది?

Published on Thu, 09/07/2023 - 13:36

యూపీలోని బస్తీలో పోలీసుల నిర్లక్ష్యం మరోమారు కనిపించింది. పోలీసులకు లభ్యమైన ఒక మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో అది మహిళ మృతదేహంగా భావించి, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆ మృతదేహాన్ని చూసి హడలిపోయారు. పోలీసుల పేర్కొన్నట్లు అది మహిళ మృతదేహం కాదని, పురుషునిదని వారు గుర్తించారు. 

వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం పోలీసులకు ఒక అనాథ మృతదేహం లభ్యమయ్యింది. అది గోనె సంచీలో కట్టివేసివుంది. ఆ మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో వారు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే వైద్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అది పురుషునిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ, వారు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. మరోమారు పంచనామా చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు.

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబౌలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోకుల్‌పూర్‌లో రోడ్డు పక్కన పోలీసులకు సంచీలో బంధించిన మృతదేహం లభ్యమయ్యింది. ఆ మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విపరీతంగా దుర్ఘందం వెలువడుతోంది. ఆ మృతదేహానికి ఉన్న జుట్టు ఆధారంగా పోలీసులు దానిని మహిళ మృతదేహంగా భావించి, దర్యాప్లు ప్రారంభించారు. కాగా ఇంతవరకూ అది ఎవరి మృతదేహమనేది తెలియరాలేదు. 
ఇది కూడా చదవండి: కుమారుని బర్త్‌డే కేక్‌ కట్‌ చేస్తూ తండ్రి మృతి!

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)