Breaking News

180 మీటర్ల రైడ్‌కు ఓలా!

Published on Fri, 06/06/2025 - 05:28

రద్దీ ట్రాఫిక్‌లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్‌మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్‌ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్‌లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్‌ సైతం తన బైక్‌ను బుక్‌ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. 

నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ‘రోహిత్‌ వ్లోగ్‌స్టర్‌’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్‌ చేసిన ఆ రైడ్‌ తాలూకు పూర్తి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?
పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్‌ నుంచి ఓలా బైక్‌ రైడ్‌ బుక్‌ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్‌కు చేరుకున్నాడు. ట్రాఫిక్‌ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్‌ ఎందుకు బుక్‌చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్‌ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్‌లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు.

 ఇంత తక్కువ దూరానికి బైక్‌ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్‌ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘

 

 180 మీటర్లకు కూడా బైక్‌ బుక్‌ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్‌ స్టార్ట్‌ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్‌ వచ్చేసింది’’ అని రైడర్‌ ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్‌ డాగ్‌కు డాగేశ్‌ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్‌ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్‌ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు.                 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)