Breaking News

భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం.. కుటుంబ సభ్యుల ఆత్మహత్య

Published on Mon, 08/04/2025 - 09:17

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా.. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ, ప్రియుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో మనోహర్‌ లోధీ, ద్రౌపది భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో ద్రౌపదికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు.. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అనంతరం, ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని భర్త సహా కుటుంబం కోరింది. అయితే, తాను మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేనని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడతాను అంటూ వారినే బెదిరించింది. దీంతో, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకయ్యారు.

ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త మనోహర్‌.. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరిగాయి. ద్రౌపది ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో.. కలత చెందిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)