Breaking News

ఆకాశ ఎయిర్‌పై మహిళ సంచలన ఆరోపణలు

Published on Thu, 01/01/2026 - 19:20

ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్‌ ఝన్‌ఝన్‌ వాలా తీసుకొచ్చిన విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్‌పై  ఒక మహిళ  ఆరోపణలు సంచలనం రేపాయి.  ఆకాసా ఎయిర్ విమానంలో పరిశుభ్రత లేక తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఒక మహిళ ఆరోపించింది.  దీనిపై  సంస్థ ఆకాశ ఎయిర్‌ స్పందించింది.

జాహ్నవి  త్రిపాఠి అనే మహిళ లింక్డిన్‌ ద్వారా తన అనుభవాన్ని పంచుకుంది. విమానంలోని అపరిశుభ్ర వాతావరణం తనను తీవ్ర అనారోగ్యం పాలుచేసిందినీ, తనతోపాటు ప్రయాణిస్తున్న తన స్నేహితులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె ఆరోపించించింది. 

తన స్నేహితులతో కలిసి జాహ్నవి బెంగళూరు-అహ్మదాబాద్‌కు డిసెంబర్ 26న రాత్రి 10:25 గంటలకు ఆకాశఎయిర్‌ విమానంలో బయలుదేరారు. విమానంలోని క్యాబిన్, సీట్ల పరిస్థితి చూసి షాక్‌ అయ్యామని, ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే కాళ్లపై తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది కాలక్రమేణా మరింత తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించింది. దీంతో నడవలేక, నిద్రపట్టక, రోజువారీ పనులు చేసుకోలేక ఇబ్బందు లుపడ్డానని చెప్పుకొచ్చింది. మొత్తం ప్రయాణమంతా దుర్బరమని పేర్కొంది. తనతోపాటు తన స్నేహితులు కూడా బాధలు పడ్డారని తన పోస్ట్‌లో పేర్కొంది.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా కృంగదీసిందని తెలిపింది. ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని వ్యాఖ్యానించింది.

ఆకాశ ఎయిర్‌ స్పందన
ఈ ఆరోపణలపై స్పందించిన ఆకాశ  ఎయిర్‌  ఆమె ఇబ్బందులపై విచారం ప్రకటించింది. అత్యున్నత పరిశుభ్రత, కస్టమర్ శ్రేయస్సే తమ లక్ష్యమని, ఫిర్యాదును పరిశీలించి, వీలైనంత త్వరగా సంప్రదిస్తామని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.
 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)