Breaking News

స్కూలు టాయిలెట్‌లో శిశు జననం.. మాయమైన తల్లి

Published on Thu, 09/21/2023 - 10:57

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోగల కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్‌లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

టాయిలెట్‌లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్‌లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు.  మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్‌లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. 

అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన  అనంతరం శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 
ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)