Breaking News

Parliament security breach: పట్టువీడని విపక్షాలు

Published on Sat, 12/16/2023 - 04:43

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్‌ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు.

పార్లమెంట్‌ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్‌లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  ఆగంతకులకు విజిటర్‌ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

లోక్‌సభ అలా...
లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న కిరీట్‌ సోలంకీ ప్రకటించారు.   

రాజ్యసభ ఇలా...
ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్‌ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్‌ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేయగా, చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్‌ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమయంలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్‌ ధన్‌ఖడ్‌ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ ప్రకటించారు.

అది మా బాధ్యత: ఖర్గే  
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్‌ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.   
గాంధీ విగ్రహం వద్ద నిరసన  
14 మంది ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్‌ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

ప్లాన్‌ బీ కూడా ఉంది..!
పార్లమెంట్‌లో అలజడికి కుట్ర పన్నిన లలిత్‌ ఝా బృందం, ప్లాన్‌ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్‌ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్‌ పార్లమెంట్‌ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్‌  మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్‌ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్‌ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్‌ రాలేకపోయారు.

బూట్లలో పొగ గొట్టాలు
లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్‌ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)