Breaking News

Karnataka: 2018 టైంలో అలా.. మరి ఇప్పుడు ఎలా?

Published on Wed, 05/10/2023 - 20:34

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని,  అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలు వెల్లడించాయి. విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు మారాయంతే) ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడికాగా.. ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది కూడా!. 

👉 కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్‌ ఛానెల్‌ సర్వే కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి.

👉 అదే సమయంలో వేసిన హంగ్‌ అంచనా కూడా ఫలించింది. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప.. మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

కానీ, 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్‌ ఎమ్మెల్యేలతో సీన్‌ మారింది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

👉 అప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌ మాదిరే ఇప్పుడు గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ పైచేయి కనిపిస్తోంది. 
 
👉 ఇక.. గత ఎగ్జిట్‌పోల్స్‌కి ఇప్పటి ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత.. జేడీఎస్‌ పార్టీ. 

గత ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్‌ విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్‌మేకర్‌ అవుతుందని కూడా ఎగ్జిట్‌పోల్స్‌  చెప్పిన జోస్యం ఫలించింది. 

👉 ఇప్పుడు కూడా ఎగ్జిట్‌పోల్స్‌.. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో.. జేడీఎస్‌ మరోసారి కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశమూ లేకపోలేదు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)