Breaking News

భార్య మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. అక్కడ ఫొటో చూసి భర్త..

Published on Mon, 04/21/2025 - 07:46

ఢిల్లీ: ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పరారీ, తన కూతురు మామతో మరో మహిళ జంప్‌ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన భార్య కనిపించకపోవడంతో టెన్షన్‌ పడి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్‌చేస్తే.. ఆమె మరో వ్యక్తితో తాజ్‌మహల్‌ వద్ద కనిపించడంతో సదరు భర్త ఖంగుతున్నాడు.

వివరాల ప్రకారం.. యూపీలోకి అలీఘర్‌కు చెందిన షకీర్‌, అంజుమ్‌ భార్యాభర్తలు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో, కంగారు పడిన షకీర్‌.. ఇంటి చుట్టుపక్కల వారిని అడిగి.. అంతా వెలికాడు. అయినప్పటికీ ఆమె కనిపించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

అయితే, షకీర్‌ బంధువు ఒకరు తాజాగా తాజ్‌మహల్‌ పర్యటకనకు వెళ్లారు. ఈ క్రమంలో అంజుమ్‌ మరో వ్యక్తితో  ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీంతో, ఆమె ఫొటో, వీడియోను వాట్సాప్ ద్వారా షకీర్‌కు పంపించారు. దీంతో, షకీర్‌కు ఒక్కసారిగా షాక్‌ కొట్టినంత పనైంది. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తి తాను పనిచేసే చోటే వర్క్‌ చేస్తున్నట్టు గుర్తించాడు. దీంతో, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?