Breaking News

భార్యను చంపి.. ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకుని..

Published on Sat, 08/01/2026 - 07:46

కర్నూలు జిల్లా: నిద్రిస్తున్న భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన నిందితుడు ఆమె సమాధి వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు, సీఐ మధు వివరాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని బాబు (56), అమృత (45) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

 మద్యానికి అలవాటు పడిన బాబు తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వారం రోజుల కిందట పూచీకత్తుపై విడుదలయ్యాడు.

 ఈ క్రమంలో అతనితో ఎవరూ సరిగా మాట్లాడటం లేదు. దీంతో మానసిక వేదనకు గురైన బాబు గురువారం రాత్రి నోములలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడే నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చూసి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)