Breaking News

భర్త నుంచి హెచ్‌ఐవీ.. కొడుకును చంపి భార్య ఆత్మహత్య

Published on Tue, 11/11/2025 - 07:52

తమిళనాడు: సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో భర్త వల్ల చిచ్చు చెలరేగింది. అతనికి హెచ్‌ఐవీ రావడం భార్య, కొడుకు ప్రాణాలను బలిగొంది. కొడుకును హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సిఫ్‌కాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి, హోసూరు పట్టణంలో ఓ వ్యక్తి (44) ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాడు, ఇతనికి భార్య (40), కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అతనికి అనారోగ్యం రావడంతో ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు, హెచ్‌ఐవి వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. 

అవాక్కైన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకొన్నారు. వీరిలో బాలిక బాగానే ఉంది, తల్లి కొడుక్కి హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆమెకు పిడుగుపడినట్ల అయ్యింది. ఇకపై తాము సమాజంలో జీవించలేమని భయాందోళనకు గురై, శనివారం అర్ధరాత్రి నిద్రపోతున్న  కుమారున్ని తలదిండుతో నొక్కి హత్య చేసి, తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం నిద్రలేచిన కుమార్తె చూసి కేకలు వేసింది. స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సిప్‌కాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా చేరుకొని మృతదేహాలను స్వా«దీనపరుచుకొని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.  

హెచ్‌ఐవీకి భయపడవద్దు  
ఆమెది తొందరపాటు నిర్ణయమని, ఇంకా పలు రకాల పరీక్షలు చేసిన తరువాతే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఉన్నది లేనిదీ నిర్ధారించాలని జిల్లా ఎయిడ్స్‌ విభాగం అధికారులు తెలిపారు. హెచ్‌ఐవీ వచ్చినంత మాత్రాన భయపడవద్దని, మంచి మందులు వాడుతూ ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చని తెలిపారు.  

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)