Breaking News

వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్‌ పవార్‌ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Published on Thu, 03/14/2024 - 17:29

రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్‌ పవార్‌ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీకి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్‌ పవార్‌ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్‌ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్‌ వర్గానికి సూచించింది.

అజిత్‌ పవర్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్‌ పవార్‌ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్‌ వర్గం పేర్కొన్నారు.

అజిత్‌ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు.

శరద్‌ పవార్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్‌ వర్గం ఎన్‌సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్‌ పవార్‌కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)