Breaking News

గంగలో వేలకొద్దీ తాబేళ్లను ఎందుకు విడిచిపెడుతున్నారంటే..

Published on Wed, 07/12/2023 - 13:18

గంగానదిలోని నీటి నాణ్యత గతంలో కన్నా ఎంతో మెరుగుపడింది. నమామి గంగే కార్యక్రమ భాగస్వాములు తెలిపిన వివరాల ప్రకారం గంగానది ప్రక్షాళనలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గంగానదిలోని వ్యర్థ పదార్థాలను అవి తింటూ, నీటిని పరిశుభ్రపరుస్తున్నాయి. గంగా యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా తాబేళ్ల సంతానోత్పత్తి పునరావాస కేంద్రం 1980 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 40 వేలకు మించిన తాబేళ్లను పవిత్ర గంగా నదిలో విడిచిపెట్టింది. 

తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రం సాయంతో..
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు గంగానదితో పాటు పలు నదులలోని నీటి స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో గంగానది నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్‌, వారణాసి జిల్లాలలోని గంగానదిలో వేల తాబేళ్లను వదలనుంది. దేశంలోనే తొలిసారిగా తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జన్మించిన తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టనున్నారు. ఇవి గంగానదిని పరిశుభ్రం చేయనున్నాయి. 


‘నమామి గంగే’ కార్యక్రమంలో..
నమామి గంగే కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ, భారత వన్యప్రాణుల విభాగం సంయుక్తంగా తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టే పనులను చేపట్టనున్నాయి. నగం కాలిన మృతదేహాలు, విసిరివేసే పుష్పాల కారణంగా గంగానది కలుషితంగా మారుతోంది. ఇటువంటి నీటిని పరిశుభ్రంగా మార్చడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఆశీష్‌ పాండ్యా మాట్లాడుతూ గంగానదిలో 2017 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 5 వేల తాబేళ్లను విడిచిపెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకూ వెయ్యి తాబేళ్లను విడిచిపెట్టామన్నారు.
ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌