Breaking News

హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..

Published on Mon, 06/12/2023 - 16:10

ద్విచక్రవాహం నడిపేవారందరికీ హెల్మెట్‌కున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసేవుంటుంది.  హెల్మెట్‌ పెట్టుకుని వాహనం నడపడం వలన ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో చాలామంది తలకు గాయాలై మరణిస్తున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. 

చాలావరకూ హెల్మెట్లు నలుపు రంగులోనే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలానే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి గల కారణం ఏమిటో, దీనివెనుకనున్న సైన్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హెల్మెట్లు నలుపు రంగులో ఉండటం వెనుక సైన్స్‌ కన్నా వాటి ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్‌ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్‌, ఫైబర్‌ గ్లాస్‌ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్‌ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్‌ కలర్‌ లేదా పిగ్మెంట్‌ బ్లాక్‌గా మారుతుంది. కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్‌తోనే హెల్మెట్‌లను తయారు చేస్తాయి. 

ఇది కూడా కారణమేనట!
మరోవైపు చూస్తే పలు కంపెనీలు ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు.  వాహనం నడిపేవారు  ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్‌ మ్యాచ్‌ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారుట. అలాగే సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా  ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి.  రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2021లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది హెల్మెట్‌ ధరించని కారణంగా మృతి చెందారు.

ఇది కూడా చదవండి: ‘తాజ్‌’ యమ క్రేజ్‌... ఆదాయంలో టాప్‌ వన్‌!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)