Breaking News

ఢిల్లీ భూకంపంలో భయపెట్టే శబ్దాలు..!కారణమిదే..

Published on Mon, 02/17/2025 - 09:27

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.

అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.

భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..

తక్కువ లోతులో  సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి. 

భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్‌గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ  తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)