Breaking News

ఆమిర్‌ ఖాన్‌ను చంపితే ఐదు కోట్ల నజరానా

Published on Wed, 07/15/2026 - 17:52

లక్నో: అయోధ్య తపస్వీకి ఛావని మఠం అధిపతి, జగద్గురు పరమహంస ఆచార్య.. ఆమిర్‌ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమిర్‌ ఖాన్‌ని చంపిన వారికి రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతే కాకుండా అతనిని చంపిన వ్యక్తికి ఎదురయ్యే  న్యాయపరమైన ఖర్చులను తానే భరిస్తానని  సంచలన ప్రకటన చేశారు. ఆమిర్‌ ఖాన్‌ మూడోపెళ్లిపై లవ్‌ జిహాద్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరమహంస ఈ విధంగా మాట్లాడారు.

వివాదం ఎందుకు

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే షిర్డీలో మీడియాతో మాట్లాడుతూ “ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, హిందూ సమాజం దాని గురించి ఆలోచించాలి. ఇది నా అభిప్రాయం. లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆమిర్ ఖాన్ అలా మారడం లేదా? అతని సినిమాలు చూసే హిందూ యువత, అలాంటి నటులను పెద్ద స్టార్లుగా చేసే ముందు వివేకంతో ఆలోచించాలి.” అని అ‍న్నారు దీంతో ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.

జగద్గురు పరమహంస ఆచార్య  స్పందన

నితేష్ రాణే చేసిన “లవ్ జిహాద్” వ్యాఖ్యను సమర్థిస్తూ పరమ , జగద్గురు పరమహంస ఆచార్య, ఆమిర్ “లవ్ జిహాద్”ను ప్రోత్సహించడానికే ఒక హిందూ మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ హిందూ మహిళలను "ఉచ్చులో" పడేస్తున్నారన్నారు ఆమిర్ ఖాన్ మూడుసార్లు వివాహం చేసుకున్నారని, ఆ మూడు వివాహాలు కూడా హిందూ మహిళలతోనే జరిగాయని పరిగణనలోకి తీసుకుంటే, నితేష్ రాణే చేసిన ప్రకటన ఆరోపణ కాదు, అది ఒక వాస్తవం. ఇలాంటి వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి. వారు సమాజంలో అనైక్యత సృష్టిస్తూ, అతను 'లవ్ జిహాద్' అని  మిషనను  ప్రోత్సహిస్తూ సమాజానికి తీవ్రమైన నేరం చేస్తున్నారని ఆరోపించారు.

ఆమిర్‌ను చంపితే ఐదుకోట్లు

పరమహంస మాట్లాడుతూ" ఏ విధంగానైనా ఆమిర్ ఖాన్‌ను ఎవరు చంపినా, వారి న్యాయపరమైన ఖర్చులన్నీ నేనే భరిస్తా వారి కుటుంబానికి రూ. 5 కోట్లు ఇస్తా, నా దృష్టిలో 'లవ్ జిహాద్'ను ప్రోత్సహించే అలాంటి 100-200 మందిని హతమార్చగలిగితే, 'లవ్ జిహాద్' పూర్తిగా అంతమవుతుంది". అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 పెళ్లి 
ఆమిర్ ఖాన్  జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ను మూడో వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా పాలి హిల్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈ వివాహం అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ పద్ధతిలో జరిగింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)