Breaking News

శరద్‌ పవార్‌ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్‌ పవార్‌?

Published on Thu, 05/04/2023 - 14:17

సాక్షి, ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరద్‌ పవార్‌ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తదుపరి చీఫ్‌గా ఎవరు నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే తదుపరి వారుసుడిని ఎంపిక చేసేందుకు పవార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుందని ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ఈ ‍కమిటీ సభ్యుల్లో కమిటీ సభ్యుల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఉన్నారు.

ఐతే పార్టీ జాతీయాధ్యక్షుడిగా పవార్‌ స్థానంలో కూతురు సుప్రియా సూలే ముందున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర చీఫ్‌గా అజిత్‌ పవార్‌ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చగ్గన్ భుజ్‌బల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్సీపీ నాయకుడు శరద్‌ పవార్‌ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇష్టపడినట్లయితే.. అజిత్‌ పవార్‌ రాష్ట్రాన్ని చూసుకుంటారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలను చూసుకుంటారని చెప్పారు.

అలాగే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల విజ్ఞప్తుల మేరకు పవార్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అంగీకరించారని ఎన్సీపీ పార్టీ సీనియర్‌ నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ చెప్పడం విశేషం. అంతేగాదు శరద్ పవార్ పదవికి రాజీనామా చేసే ప్రకటనపై తుది నిర్ణయం వెలువడేంత వరకు ఆయన వారసుడిగా పార్టీ చీఫ్‌ని ఎంపిక చేసే ప్రశ్నే లేదని పటేల్‌ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్‌ నిర్ణయానికి నిరసనగా పార్టీ నేతలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్టీ పవార్‌ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు యత్నిస్తోంది, కాబట్టి కార్యకర్తలంతా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు.

ఇదిలా ఉండగా..అజిత్ పవార్ పార్టీని చీల్చి, అధినేతగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ అనూహ్య చర్య తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు తలెత్తకుండా ఉండేలా ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, శరద్‌ పవార్‌ మాత్రం కొత్తతరం పార్టీకి మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని , అత్యాశ ఉండకూదని చెబుతూ..జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

(చదవండి: శరద్‌ పవార్‌ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా అది కుదరని!)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)