Breaking News

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం.. కారణం ఏంటంటే?

Published on Wed, 01/28/2026 - 15:25

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రయాణిస్తున్న విమానం బుధవారం ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్‌ పవార్‌, విదీప్‌ జాదవ్‌,పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్‌లు ప్రాణాలు కోల్పోయారు

అయితే, ఈ ఘటనలో అజిత్‌ పవార్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలెట్ల గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్‌ పవార్‌ మంగళవారం ఉదయం ముంబై నుంచి లియర్‌జెట్‌ 45 విమానంలో బయలు దేరారు. అయితే, ఈ విమానం, బరామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. విమాన ప్రమాదంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు  అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, అలాగే పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ శంభవి పాఠక్ అక్కడికక్కడే మరణించారు.

కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయనకు బిజినెస్‌ ఫ్లైట్స్‌ నడిపిన అనుభవం ఉంది. శంభవి పాఠక్ కూడా శిక్షణ పొందిన కమర్షియల్ పైలట్. గతంలో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ఇద్దరూ వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు పనిచేస్తున్నారు.

విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందో, సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బరామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)