Breaking News

ఇంతకీ ఇండిగో ఓనర్‌ ఎవరో తెలుసా?

Published on Sat, 12/06/2025 - 11:11

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ  ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త సిబ్బంది విధుల నియమాలు (ఎఫ్‌డీటీఎల్‌), సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఆలస్యం ఆలస్యం కావడం లేదా రద్దు చేయడం జరిగింది. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశించినప్పటికీ.. ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు. మరో పది రోజుల్లో.. సాధారణ కార్యకలాపాలు తిరిగి కొనసాగవచ్చని  కంపెనీ తెలిపింది. ఇటువంటి తరుణంలో ‘ఇండిగో’ యజమాని ఎవరు? అని నెట్టింట చర్చ జరుగుతోంది.. 

ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ కలిసి స్థాపించారు. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 1989లో ఏర్పాటు అయ్యింది. వాయు రవాణా నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద క్యారియర్‌గా ఎదిగింది. రాహుల్ భాటియా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలోని కీలక వాటాదారులలో ఒకరు. కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన భాటియా నాయకత్వంలో ‘ఇండిగో’ కేవలం విమానయానానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాలకూ విస్తరించింది.

వీటిలో హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, పైలట్ శిక్షణ, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీరింగ్ వంటి ముఖ్య వ్యాపార వెంచర్లు ‘ఇండిగో’లో ఉన్నాయి. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ భాటియా ఆస్తుల నికర విలువ $8.1 బిలియన్లు(సుమారుగా రూ. 67,230 కోట్లు) ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రాహుల్ భాటియా 420వ స్థానంలో  ఉన్నారు. అతను ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో ప్రమోటర్‌గా ఉంటూ, నేరుగా 0.01% వాటా లేదా 40,000 షేర్లను కలిగి ఉన్నారు.

మరొక సహ వ్యవస్థాపకుడు అయిన రాకేష్ గంగ్వాల్, ఇండిగోను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, 2022లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. అప్పటి నుండి ఆయన ఎయిర్‌లైన్‌లో తన వాటాను విక్రయిస్తున్నారు. ప్రస్తుత బీఎస్ఈ (బీఎస్‌ఈ) డేటా ప్రకారం రాకేష్ గంగ్వాల్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సుమారు 4.53% వాటా లేదా 1,75,30,493 షేర్లను కలిగి ఉన్నారు. అంతకుముందు ఆయన దాదాపు 13.5% వాటా కలిగి ఉండేవారు. ఇండిగో ప్రస్తుతం 434 సొంత విమానాలను కలిగివుంది. అలాగే రోజుకు 2,300 విమానాలను నడుపుతూ, దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)