వాట్సప్‌ పేమెంట్‌ను ఇక అందరూ వాడొచ్చు

Published on Wed, 01/01/2025 - 05:40

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ యాప్‌ అయిన వాట్సాప్‌లో ఇంతకాలం కేవలం కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు బదిలీ వెసులుబాటు ఉండగా ఇకపై అందరికీ ఆ అవకాశం దక్కనుంది. అతి త్వరలోనే ఈ చెల్లింపుల సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెక్స్‌ మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు షేర్‌చేసుకోవడంలో భారత్‌లో అగ్రగామి సోషల్‌మీడియా యాప్‌గా వర్ధిల్లుతున్న వాట్సాప్‌ ఇకపై పేమెంట్‌ యాప్‌గానూ ఎదిగే అవకాశాలు మెరుగయ్యాయి. దేశంలో ఆన్‌లైన్‌ చెల్లింపులపై నియంత్రణ బాధ్యతలు చూసే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) గతంలో వాట్సాప్‌కు కేవలం భారత్‌లోని 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే పేమెంట్స్‌ ఆప్షన్‌ ఇచ్చారు.

తాజాగా ఆ పరిమితిని ఎత్తేశారు. దీంతో ఇకపై యూజర్లు అందరూ వాట్సాప్‌ ద్వారా నగదు చెల్లింపుల సేవలను వినియోగించుకోవచ్చని ‘వాట్సాప్‌ పే’ బహిరంగంగా అధికారికంగా స్మార్ట్‌ఫోన్లలో ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొదట్నుంచి చూస్తే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) చెల్లింపుల సేవలు విస్తరించుకోవడంపై వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ దశలవారీగా పరిమితిని పెంచుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లకు మాత్రమే యూపీఐ పేమెంట్స్‌ ఆప్షన్‌ ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ పరిమితిని 10 కోట్ల మంది యూజర్లకు అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్‌ నగదు చెల్లింపుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీసీఐ తాజాగా ఈ పరిమితిని ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

13 బిలియన్ల లావాదేవీలు
భారత్‌లో ఇప్పుడు యూపీఐ లావాదేవీలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. నెలకు కనీసం 1300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా గూగుల్‌ పే, ఫోన్‌పే యాప్‌లలోనే దాదాపు 85 శాతం లావాదేవీలను యూజర్లు పూర్తిచేస్తున్నారు. దేశంలో వాట్సాప్‌ యాప్‌ను ఏకంగా 50 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్న వాట్సాప్‌ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌ను విస్తరిస్తే దేశంలోనే అగ్రగామి పేమెంట్‌ యాప్‌గానూ దూసుకుపోనుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో వాట్సాప్‌ మాతృసంస్థ మెటాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల మెటా తమ కృత్రిమేథ ఉపకరణం అయిన ‘మెటా ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది.

దీనికి భారత్‌లో చక్కటి ప్రజాదరణ దక్కింది. గతంలో మాదిరే వాట్సాప్‌ పే విభాగం యూపీఐ వారి థర్ట్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ నిబంధనావళిని పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, భారతీయ బ్యాంక్‌ల సమాఖ్య(ఐబీఏ)లు సంయుక్తంగా యూజర్లు అత్యంత వేగంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఎన్‌పీసీఐను ఏర్పాటుచేశాయి. ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోనే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ పనిచేస్తోంది.

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)