Breaking News

వాట్సాప్‌లో ఎడిట్‌ ఫీచర్‌ ప్రారంభం

Published on Tue, 05/23/2023 - 06:09

న్యూఢిల్లీ: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున, తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్‌ బటన్‌ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్‌ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్‌ మెసేజ్‌లు ఎడిట్‌ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు. మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్‌ లభిస్తుందని యాజమాన్యం తెలియజేసింది.   

మెసేజ్‌లు ఎలా ఎడిట్‌ చేయాలి?  
1. వాట్సాప్‌ యాప్‌లో ఎనీ చాట్‌లోకి వెళ్లాలి.
2. పొరపాటున పంపిన మెసేజ్‌పై వేలితో కాసేపు నొక్కి ఉంచాలి(లాంగ్‌ ప్రెస్‌).  
3. ఇప్పుడు ఎడిట్‌ మెసేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై నొక్కి, సందేశాన్ని ఎడిట్‌ చేయొచ్చు. మెసేజ్‌ పంపిన తర్వాత కేవలం 15 నిమిషాలలోపే ఈ వెసులుబాటు ఉంది. గడువు దాటితే ఆ మెసేజ్‌ను పూర్తిగా డిలీట్‌ చేయడం మినహా మరో మార్గం లేదు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)