టెండర్‌ ఓటింగ్‌ అంటే ఏమిటి? ఎన్వలప్‌లో ఓటు ఎందుకు ప్యాక్‌ చేస్తారు?

Published on Sat, 09/23/2023 - 07:10

దేశంలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, మధ్యలో లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. వన్ కంట్రీ- వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈవీఎం వినియోగానికి బదులుగా ఎన్వలప్‌ ఉపయోగించే ఓటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్నే టెండర్ ఓటింగ్ అని అంటారు.

భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కు
భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. దేశపౌరుడు వేసే ఓటు అటు దేశ, ఇటు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ సమయంలో చాలాసార్లు నకిలీ ఓట్లు కనిపిస్తుంటాయి. ఒకరి ఓటును మరొకరు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే టెండర్ ఓటింగ్ అనే నిబంధన ఉంది.

పోలింగ్‌ జరుగుతున్న రోజున మీరు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మీ ఓటు ఇప్పటికే ఎవరో వినియోగించారని చెప్పారనుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు టెండర్ ఓటింగ్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
దీని కోసం ముందుగా మీరు మీ గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న  ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. మీరు ఓటు వేయలేదని ముందుగా వారికి చెప్పాలి. అప్పుడు వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీరు మీ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఈవీఎంలపై ఓటు వేయనప్పటికీ, బ్యాలెట్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే టెండర్ ఓటింగ్ అంటారు. అటువంటప్పుడు మీకు అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు ఉండే ఒకపత్రం అందజేస్తారు. అప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో అదే స్లిప్‌లో టిక్‌ చేయాలి. దీని తరువాత ప్రిసైడింగ్ అధికారి ఆ స్లిప్‌ను ఒక కవరులో  సీలు చేసి, పెట్టెలో భద్రపరచి, కౌంటింగ్‌ రోజున దానిని లెక్కిస్తారు.
ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్‌ ఎందుకు?

Videos

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)