Breaking News

చక్రాల కుర్చీ ఎప్పుడు...ఎలా వచ్చిందో తెలుసా?

Published on Sat, 01/03/2026 - 15:22

కాళ్లు లేని వారికి చక్రాల కుర్చీ ఓ వరం. దీన్ని ఇంగ్లీషులో ’గిజ్ఛి్ఛ∙ఇజ్చిజీట’ అంటారు. కాళ్లు లేనివారు ఇందులో కూర్చుని ముందుకు సాగుతారు. వారికే కాకుండా రోగులు, వృద్ధులు, ఎక్కువ దూరం నడవలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరుల సాయం లేకుండా సొంతంగా ముందుకు సాగేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన ఈ చక్రాల కుర్చీ గురించి మీకు తెలుసా? 

క్రీ.పూ. 5వ శతాబ్దంలో సంస్కృత వ్యాకరణవేత్త పాణిని తన అష్టాధ్యాయిలో ’పర్ప’ అనే సంస్కృత పదాన్ని ప్రస్తావించారు. అదే నేటి చక్రాల కుర్చీ అని భావిస్తారు. మంచానికి, కుర్చీలకు చక్రాలు బిగించిన ఆధారాలు చైనాలో ఒక రాతి పలకపై లభించాయి. ఇవి క్రీ.పూ. 6వ, 5వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి. 
యూరప్‌లో వీల్‌చైర్‌ 1595 వరకు ఉనికిలో లేదు.  స్పెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిలిప్‌ రాజు ఐఐ కోసం ఒక కుర్చీని తయారు చేశాడు. డిజైన్‌లో లోపాల కారణంగా దీన్ని నడపడం ఇబ్బందిగా మారింది. 

1655లో స్టీఫన్‌ ఫార్ఫ్లర్‌ అనే వ్యక్తి 22 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ, తను నడిచేందుకు మూడు చక్రాల చట్రంపై ఓ కుర్చీని తయారుచేశాడు. ఇది వీల్‌చైర్‌ కన్నా హ్యాండ్‌సైకిల్‌ను  పోలి ఉంటుంది. 1760   ప్రాంతంలో ఇన్వాలిడ్‌ క్యారేజ్‌ /బాత్‌ చైర్‌ సాధారణ వాడుకలోకి వచ్చింది. 1887లో అట్లాంటిక్‌ నగరానికి వీల్‌చైర్‌లు వచ్చాయి. 1933లో హ్యారీ సి. జెన్నింగ్స్‌ సీనియర్, అతని దివ్యాంగ స్నేహితుడు హెర్బర్ట్‌ ఎవరెస్ట్‌ కలిసి మొదటిసారిగా ఉక్కుతో తయారు చేసిన  పోర్టబుల్‌ వీల్‌చైర్‌ను కనుగొన్నారు. అనంతరం అనేక మార్పులు చెంది ప్రస్తుతం మనం చూస్తున్న వీల్‌చైర్‌ అందుబాటులోకి వచ్చింది. తోసే అవసరం లేకుండా కంట్రోల్‌ ద్వారా నడిచే వీల్‌చైర్‌లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)