Breaking News

బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్‌

Published on Sun, 08/20/2023 - 12:21

నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 

21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్‌లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్‌ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. 

అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. 

ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్‌లో సన్‌బాత్‌ చేస్తున్నారు. 

ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు.

ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. 
ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)