Breaking News

1,000 మందిని లైంగికంగా వేధించానా? నేనేమైనా 'శిలాజిత్' రోటీలు తింటున్నానా?

Published on Mon, 05/01/2023 - 16:48

న్యూఢిల్లీ: రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్‌తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు.

దీంతో బ్రిజ్‌ భూషణ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్‌ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు.

బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్‌పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్‌ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ,  క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్‌ను ఉపయోగిస్తే  సామ‌ర్థ్యం పెరుగుతుందని అంటారు.  ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు.
చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)