Breaking News

పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!

Published on Mon, 12/02/2024 - 12:01

దాదర్‌: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్‌ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్‌ రైళ్ల కారణంగా నాన్‌ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్‌ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్‌ రైల్వే మార్గంలో ఏసీ లోకల్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్‌ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్‌ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సెంట్రల్‌ రైల్వే మార్గంలో ఏసీ లోకల్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్‌ క్లాస్‌ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్‌ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్‌ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. 

ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్‌ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్‌ ఏసీ లోకల్‌ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్‌ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్‌ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్‌ రైళ్లను ఫాస్ట్‌ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్‌–చర్చిగేట్‌ స్టేషన్ల మధ్య, భాయిందర్‌–చర్చిగేట్‌ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్‌–విరార్‌ (డౌన్‌) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి.     

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)