Breaking News

చంపేశాడు... ఇంటికొచ్చి నిద్రపోయాడు!

Published on Mon, 08/12/2024 - 09:23

న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్‌జీ కార్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఇండియా ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం దేశంలో పలు రకాలైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.  

మరోవైపు ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణపై అరెస్టయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చిన అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

పారదర్శకంగా దర్యాప్తు
జూనియర్‌ డాక్టర్‌ హత్య కేసులో నేరానికి కారకులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగతున్నాయి. ఈ తరుణంలో నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు  పారదర్శకంగా ఉందని, పుకార్లను నమ్మొద్దని కోరారు.  

 సాక్ష్యాలను నాశనం చేసేందుకు..
‘నేరం చేసిన తర్వాత, నిందితుడు తిరిగి తన ఇంటికి వెళ్లి శుక్రవారం తెల్లవారుజాము వరకు నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత, సాక్ష్యాలను నాశనం చేసేందుకు అతను ధరించిన బట్టలు ఉతికాడు. అతడి షూపై రక్తపు మరకల్ని గుర్తించాము’ అని చెప్పారు. వైద్యురాలు హత్యకేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా..ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.  

ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
గురువారం రాత్రి విధుల్లో ఉన్న వ్యక్తులతో మరుసటి రోజు ఉదయం వరకు మాట్లాడుతున్నామని, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం నాడు ఫోరెన్సిక్ యూనిట్‌తో పాటు సిట్‌లోని పోలీసు అధికారుల బృందం ఆసుపత్రిలోని సెమినార్ హాల్ నుండి నమూనాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

డిమాండ్స్‌ నెరవేర్చే వరకు ఆందోళన తప్పదు
అయితే ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు, తాము పూర్తిగా సంతృప్తి అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, భద్రతకు సంబంధించిన  డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)