Breaking News

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న రైలు.. విద్యార్థులు మృతి

Published on Fri, 07/17/2026 - 10:19

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. వారిలో ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్ రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో అదే మార్గంలో వస్తున్న నిమ్తితా–కట్వా ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా స్కూల్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు వాహనం పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే, ప్రమాద సమయంలో రైల్వే క్రాసింగ్ తెరిచి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. కొంతమంది స్థానికుల కథనం ప్రకారం.. ఒక రైలు వెళ్లే వరకు గేట్ మూసి ఉందని, ఆ తర్వాత తెరిచారని, కానీ పక్క లైన్‌లో మరో రైలు వస్తున్నప్పటికీ గేట్ మళ్లీ మూయలేదని ఆరోపించారు. గేట్‌మన్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

 

రైల్వే క్రాసింగ్ వద్దే ప్రమాదమా?
ఇక, విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా... గేట్‌మన్ నిర్లక్ష్యం ఉందా? అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు, బాధ్యులపై చర్యల విషయంలో దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)