Breaking News

కోల్‌కతా కేసు.. సందీప్‌ ఘోష్ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

Published on Thu, 09/19/2024 - 18:53

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్‌జీ కర్ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దుచేసింది. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 7న మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు కూడా  జారీ చేసింది.

కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు నిన్న(బుధవారం) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్‌రాయ్‌ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా  కేసులో సంజయ్‌రాయ్‌ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్‌ ధరించిన దుస్తులను సీజ్‌ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్‌ పోలీసులకు రెండు రోజులు పట్టింది.

ఇదీ చదవండి: నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి

ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్‌ దుస్తులను సీజ్‌ చేసి  ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్‌ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌, తాలా మాజీ సీఐ అభిజిత్‌ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు  చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన  ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)