Breaking News

మంచు, వర్షాల కారణంగా ఐదు హైవేలు, 300 రోడ్లు మూసివేత!

Published on Wed, 02/21/2024 - 07:09

ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా, అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఐదు జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్‌లో 263  రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

గడచిన 24 గంటల్లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి  వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యింది.

వాతావరణంలోని మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలుప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని చురులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పర్వత, మైదాన ప్రాంతాల్లో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 
 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)