Breaking News

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతాం

Published on Sun, 11/30/2025 - 03:27

సాక్షి, బెంగళూరు: ‘‘అధి కార మార్పిడి అంశంపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. గతంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు, ఇకముందు కూడా కలిసి పనిచేస్తాం’’అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తేల్చిచెప్పారు. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం కావేరిలో అల్పాహార భేటీ అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. 

నెల రోజుల నుంచి ఉన్న సందిగ్ధతకు తెరదించేందుకే ఈ భేటీ జరిగిందని, రేపటి నుంచి ఎలాంటి గందరగోళాలు ఉండవని సీఎం సిద్ధు పేర్కొన్నారు. హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలనే అంగీకారానికి వచ్చామని తెలిపారు. ‘‘కేసీ వేణుగోపాల్‌ నాకు ఫోన్‌ చేసి డీకేను అల్పాహార భేటీకి పిలవమని చెప్పారు. డీకేకు కూడా ఆయన ఫోన్‌ చేశారు. మీరే మా ఇంటికి భోజనానికి రావాలని డీకే నన్ను ఆహ్వానించారు. 

తొలుత మీరే అల్పాహార భేటీకి రావాలని అడిగాను. మాకు 2028 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఎంతో ముఖ్యం. వాటిపై చర్చించాం. డిసెంబర్‌ 8న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై మాట్లాడుకున్నాం. అవాస్తవాలు, అబద్ధాలు, ఆరోపణలు బీజేపీ, జేడీఎస్‌కు అలవాటే. వాటిని సమర్థంగా ఎదుర్కొంటాం. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని పత్రికల్లో చూస్తున్నా. అసెంబ్లీలో మా బలం 140, ప్రతిపక్షాలు రెండూ కలిసినా వారి బలం 82 దాటదు. అవిశ్వాసానికి అవకాశమే లేదు’’అని సీఎం సిద్ధు వివరించారు. 

సీఎం ప్రతి మాటకు నా మద్దతు.. 
సీఎం చెప్పిన ప్రతి మాటకు మద్దతు పలుకుతున్నానని, నాయకత్వం విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అని, పార్టీ పెద్దలు తమను పిలిస్తే ఢిల్లీకి వెళ్తా మని డీకే అన్నారు. ప్రజలకు ఇచి్చన వాగ్దానం ప్రకారం సిద్ధుతో కలిసి పనిచేస్తా నని తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించారని, ఇంకొంతకాలం వేచి ఉండడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఒకట్రెండు రోజు ల్లో సీఎం తమ ఇంటికి భోజనానికి వస్తారని పేర్కొన్నారు. 

‘‘రాజకీయంగా మా ఇద్దరిదీ ఒకే తీర్మానం. గతంలో అధిష్ఠానం ఏ నిర్ణయించిందో దాని ప్రకారం మేమంతా వెళ్తున్నాం. భవిష్యత్తులోనూ వెళ్తాం. మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మాకు వర్గాలు లేవు. మాది కాంగ్రెస్‌ పార్టీ వర్గం. సిద్ధరామయ్య 2013లో సీఎం అయినప్పుడు నాకు ఆర్నెల్లు మంత్రి పదవి దక్కలేదు. అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. మేమంతా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం. అందరిని కలుపుకొని వెళ్లే బాధ్యత మాపై ఉంది’’అని చెప్పారు. 

కాగా, అధిష్ఠానం సూచనలతో శనివారం ఉదయం 9.30కు డీకే శివకుమార్‌ సీఎం సిద్ధు అధికారిక నివాసం కావేరికి అల్పాహార భేటీకి వెళ్లారు. డీకేను సీఎం సాదరంగా స్వాగతించి లోపలకు తీసుకెళ్లారు. ఇద్దరు ప్రత్యేక గదిలో చర్చించుకున్నారు. అరగంట పాటు జరిగిన సమావేశంలో ఢిల్లీలో 2023లో జరిగిన ఒప్పందం, నాయకత్వ మార్పు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలు చర్చించినట్లు తెలిసింది.  

నేడు సోనియా సమక్షంలో తుది నిర్ణయం 
రాహుల్‌గాంధీ శనివారం ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు సమావేశమయ్యారు. సిద్ధు–డీకే భేటీ, తదుపరి పరిణామాల గురించి ఖర్గే–రాహుల్‌ చర్చించారు. ఆదివారం ఖర్గే, రాహుల్‌ మరోసారి సమావేశమై అగ్రనేత సోనియాగాం«దీతో చర్చించి, తుది నిర్ణయానికి వస్తారని తెలిసింది.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)